News July 21, 2024

ఫాంటసీ వెబ్ సిరీస్‌లో సమంత?

image

అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత తిరిగి ప్రాజెక్టుల జోరు పెంచారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కే ఫాంటసీ వెబ్ సిరీస్‌లో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిని హారర్ థ్రిల్లర్ ‘తుంబాడ్’ మూవీ దర్శకుడు అనిల్ బార్వే తెరకెక్కించనున్నారు. మొదట సినిమాగా తీయాలనుకున్నా లెంగ్త్‌ను దృష్టిలో పెట్టుకొని వెబ్ సిరీస్‌గా మార్చారట. ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బీ ఇందులో నటించనున్నారు.

Similar News

News December 31, 2025

వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారా?

image

AP: YCP నేత, మాజీ MLA వల్లభనేని వంశీని మళ్లీ అరెస్టు చేస్తారా అనే చర్చ జరుగుతోంది. 2024 జూన్ 7న సునీల్‌ అనే వ్యక్తిపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 17న వంశీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయన కనిపించకపోవడంతో, పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన 137 రోజులు జైలులో ఉండి వచ్చిన విషయం తెలిసిందే.

News December 31, 2025

సమ్మె ప్రభావం కనిపించట్లే!

image

న్యూఇయర్ వేడుకల వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. సుమారు 1.5 లక్షల మంది డెలివరీ కార్మికులు ఈ నిరసనలో పాల్గొంటారని TGPWU తెలిపింది. అయితే ఈ సమ్మెలో చాలా మంది పాల్గొనట్లేదని తెలుస్తోంది. న్యూఇయర్ డిమాండ్, ఆర్థిక పరిస్థితులతో చాలామంది డెలివరీ ఏజెంట్లు డ్యూటీ ఎక్కారు. HYDలో ఎప్పటిలాగే వేగంగా డెలివరీ చేస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలానే ఉందా? కామెంట్.

News December 31, 2025

ప్రైవేటు స్కూళ్లలోనూ ఫిజికల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి

image

AP: ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రతిరోజూ గంట సమయాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించాలని ఆదేశించింది. ఈ సమయాన్ని రెగ్యులర్ టైమ్‌టేబుల్‌లో చేర్చాలని స్పష్టం చేసింది. రోజుకు 10 నిమిషాలు ధ్యానం, వారానికి ఒక పీరియడ్ హెల్త్ ఎడ్యుకేషన్‌కు కేటాయించాలని, పదో తరగతికి సైతం మినహాయింపుల్లేవని పేర్కొంది.