News March 16, 2025
ఆస్పత్రిలో సమంత.. అభిమానుల ఆందోళన

హీరోయిన్ సమంత మరోసారి ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సామ్‌కు మళ్లీ ఏమైంది, ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటూ టెన్షన్ పడుతున్నారు. కాగా సమంత కొంత కాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’ చిత్రంలో నటిస్తున్నారు.
Similar News
News March 17, 2025
IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.
News March 17, 2025
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
News March 17, 2025
ఆ నటిని అమ్మ అని పిలుస్తా: కళ్యాణ్ రామ్

సీనియర్ నటి విజయశాంతిని అమ్మ అని పిలుస్తానని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో కలిసి నటించడం వల్ల ఆమెతో అనుబంధం పెరిగిందని చెప్పారు. ఈ సినిమాలో తల్లీకొడుకులు ఎందుకు దూరమయ్యారు? తిరిగి ఎలా కలిశారు? అనేదే కీలకమన్నారు. విజయశాంతి ఈ చిత్రానికి ప్రధాన బలమని, పోరాట సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించారని కొనియాడారు. రేపు ఉ.10 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.