News October 22, 2024
మోస్ట్ పాపులర్ హీరోయిన్గా సమంత

SEP నెలకుగాను మోస్ట్ పాపులర్ హీరోగా దళపతి విజయ్ నిలిచినట్లు ORMAX MEDIA వెల్లడించింది. ఆ తర్వాత వరుసగా ప్రభాస్, షారుఖ్, అజిత్ కుమార్, NTR, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఉన్నారంది. హీరోయిన్లలో సమంత అగ్రస్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఆలియా భట్, దీపికా పదుకొణె, నయనతార, త్రిశ, శ్రద్ధా కపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక, కియారా ఉన్నారని పేర్కొంది.
Similar News
News December 2, 2025
హనుమద్వ్రతం ఎందుకు చేయాలి?

హనుమద్వ్రత ఫలితం కార్యసాధనకు తోడ్పడుతుందని, పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తుందని పండితులు చెబుతున్నారు. ‘స్వామిని మనసారా స్మరిస్తే ధైర్యం చేకూరి కార్యోన్ముఖులు అవుతారు. సకల భయాలూ నశిస్తాయి. గ్రహ పీడలు, పిశాచ బాధలు దరిచేరవు. మానసిక వ్యాధులు తొలగిపోయి, మనసులో ప్రశాంతత, సానుకూలత నెలకొంటాయి. ఇది విజయాన్ని, శాంతిని, రక్షణను ఏకకాలంలో ప్రసాదించే శక్తివంతమైన వ్రతం’ అని అంటున్నారు. జై హనుమాన్!
News December 2, 2025
ఊటనేల దున్నినా, మట్టి పిసికినా, ఫలితం బురదే

ఊటనేల ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండే, సహజంగానే చిత్తడిగా ఉండే భూమి. ఆ నేలలో ఎంత కష్టపడి నాగలితో దున్నినా లేదా చేతులతో మట్టిని పిసికి గట్టి పరచడానికి ప్రయత్నించినా దాని స్వభావం మారదు. చివరికి మిగిలేది గట్టిపడని, వ్యవసాయానికి పనికిరాని బురద మాత్రమే. కొన్నిసార్లు కొందరి మనుషుల స్వభావాన్ని ఎంత మార్చాలని ప్రయత్నించినా అవి మారవు. దాని వల్ల మన శ్రమే వృథా అవుతుందని ఈ సామెత చెబుతుంది.
News December 2, 2025
రాజీనామా వెనక్కి తీసుకున్న జకియా ఖానం!

AP: శాసనమండలి అభ్యర్థిత్వానికి రాజీనామా చేసిన ఆరుగురు MLCలను ఛైర్మన్ మోషేన్ రాజు నిన్న పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా జకియా ఖానం తన రాజీనామా వెనక్కి తీసుకున్నారు. పదవీకాలం 7నెలలే మిగిలి ఉందని, ఎన్నిక నిర్వహించడానికి టైం ఉండదని ఛైర్మన్ చెప్పడంతో రాజీనామా ఉపసంహరించుకున్నారు. మిగతా MLCలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, సునీత, జయమంగళ, మర్రి రాజశేఖర్లు తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.


