News April 21, 2025
ఆ పోస్టుకు సమంత లైక్.. విడాకుల కారణంపై చర్చ

‘భార్య అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలేయడానికే మొగ్గుచూపుతాడు. కానీ భార్య మాత్రం భర్త ఆరోగ్యం బాగోలేకపోయినా అతడిని విడిచిపెట్టాలనుకోదు’ అనే ఓ ఇన్‌స్టా పోస్టుకు హీరోయిన్ సమంత లైక్ కొట్టారు. ఇది నెట్టింట చర్చకు దారితీసింది. సామ్ గతంలో మయోసైటిస్‌తో బాధపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాధే ఆమె విడాకులకు కారణమా? అని చర్చించుకుంటున్నారు. 2021లో చైతూ, సామ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News April 21, 2025
సిట్ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన గోవా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. కాసేపట్లో విజయవాడకు తరలించనున్నారు. కాగా ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ కసిరెడ్డి ఈ ఉదయం ఆడియో రిలీజ్ చేశారు.
News April 21, 2025
BE READY: రేపు మ.12 గంటలకు..

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు మ.12 గం.కు విడుదల కాబోతున్నాయి. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. దాదాపు 9.5లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. Way2News యాప్ ద్వారా ఎలాంటి యాడ్స్ లేకుండా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. మార్క్స్ లిస్టును ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేయొచ్చు.
*విద్యార్థులకు Way2News తరఫున BEST OF LUCK
News April 21, 2025
ఈ ఏడాది చివరికల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి: నిమ్మల

AP: పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో 202 మీటర్లకు పైగా నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెల 30 నాటికి మూడో కట్టర్ కూడా అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది చివరికల్లా వాల్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని వివరించారు.