News March 19, 2024
సమంత కొత్త సిరీస్ టైటిల్ ఫిక్స్
సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ కాంబినేషన్లో వస్తున్న సిరీస్కు టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘సిటాడెల్: హనీ-బన్నీ’(Citadel Honey Bunny) పేరుతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మరో బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్&డీకే దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.
Similar News
News January 7, 2025
ప్రపంచాన్ని వణికించిన వైరస్లు ఇవే!
కరోనాను మరవకముందే hMP వైరస్ భారత్ను తాకి కలవరపెడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, కరోనాకు ముందే వివిధ కాలాల్లో ప్రపంచాన్ని కొన్ని వైరస్లు వణికించగా, కొన్ని ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి.
1. రోటా వైరస్, 2. స్మాల్ పాక్స్, 3. మీజిల్స్(తట్టు), 4. డెంగ్యూ, 5. ఎల్లో ఫీవర్, 6. ఫ్లూ, 7. రేబిస్, 8.హెపటైటిస్-బీ&సీ, 9. ఎబోలా, 10. హెచ్ఐవీ.
News January 7, 2025
ఈ కోడి గుడ్డు ధర రూ.700
AP: సాధారణంగా బ్రాయిలర్ కోడి గుడ్డు ధర రూ.6-8, నాటు కోడి గుడ్డు అయితే రూ.10-13 పలుకుతుంది. అయితే పందెం కోడి గుడ్డుకు రూ.400-700 వరకు డిమాండ్ ఉంటోంది. తూర్పు కోడి, ఎర్ర కక్కెర, తెల్ల కోడి గుడ్డు రూ.400 వరకు, తెల్ల కెక్కర, ఎర్రమైల, అబ్రాసు మైల జాతుల గుడ్డు రూ.700 వరకు పలుకుతోంది. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో చాలా మందికి ఇదొక కుటీర పరిశ్రమగా మారింది.
News January 7, 2025
కాంగ్రెస్ మోసంపై నిరసనలు ఢిల్లీకి చేరాయి: కేటీఆర్
TG: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకోవడంపై ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు వద్ద పోస్టర్లు వెలిశాయని తెలిపారు. ‘రైతు డిక్లరేషన్’ ఎలా అమలవుతుందో రాష్ట్రానికి వచ్చి వివరించవచ్చు కదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ‘అబద్ధాల కాంగ్రెస్లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే’ అని ట్వీట్ చేశారు.