News December 12, 2024

కీర్తి సురేశ్‌కు సమంత స్పెషల్ నోట్

image

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలుపుతూ ఇన్‌స్టాలో సమంత స్పెషల్ పోస్ట్ చేశారు. కీర్తి పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ ‘అందమైన ఈ జంటకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ జోడీ ఎల్లప్పుడూ ప్రేమ, సంతోషంతో ఉండాలి’ అని రాసుకొచ్చారు. కాగా వీరిద్దరూ ‘మహానటి’ సినిమాలో నటించారు.

Similar News

News December 12, 2024

సంక్రాంతిలోగా వీఆర్వో వ్యవస్థ తీసుకొస్తాం: మంత్రి

image

TG: సంక్రాంతిలోగా వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈనెల 31లోగా హాస్టళ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ తల్లి విగ్రహంపై సమాధానం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా టీషర్టుల డ్రామా ఆడి పారిపోయారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

News December 12, 2024

ALERT.. ఈ జిల్లాల్లో చలిగాలులు

image

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.

News December 12, 2024

డిసెంబర్ 29న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

image

TG: డిసెంబర్ 29న కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. మల్లన్న కళ్యాణం, జాతరపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జనవరి 19 నుంచి మార్చి 24 వరకు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రూ.46 కోట్లతో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. అటు త్వరలో CM రేవంత్‌ను కలిసి స్వామి కళ్యాణోత్సవానికి ఆహ్వానించనున్నట్లు ఆమె తెలిపారు.