News July 9, 2024

AAGగా సాంబశివ ప్రతాప్

image

AP: అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా తమ పార్టీకి చెందిన లీగల్ సెల్ ఛైర్మన్ ఈవన సాంబశివ ప్రతాప్ ఎంపికైనట్లు జనసేన వెల్లడించింది. ప.గో(D) పాలకొల్లు(మ) తిల్లపూడికి చెందిన ఆయన ఉమ్మడి, విభజిత ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. దాదాపు 40 ఏళ్లు ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉన్న ఆయన.. 2016-19 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. JSP ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి న్యాయపరమైన సేవలు అందిస్తున్నారు.

Similar News

News December 18, 2025

ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

తెలుగు రాష్ట్రాల్లో చలి, పొగమంచు తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలు ఉదయం బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. TGలో 2-3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు YELLOW ALERT ఇచ్చింది. అటు APలోని మన్యంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి.

News December 18, 2025

OG కోసం సొంత కారు అమ్మిన డైరెక్టర్!

image

డైరెక్టర్ సుజీత్‌కు హీరో పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ ఇచ్చిన <<18579913>>విషయం<<>> తెలిసిందే. ఆ కారును పవన్ గిఫ్ట్‌గా ఎందుకిచ్చారో సినీవర్గాలు తెలిపాయి. ‘OGలోని కొన్ని సీన్లు జపాన్‌లో షూట్ చేద్దామనుకుంటే బడ్జెట్ వల్ల నిర్మాత ఒప్పుకోలేదు. ఈ సీన్ ప్రాధాన్యం దృష్ట్యా సుజీత్ తన కారు అమ్మేసి షూట్ పూర్తిచేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్.. అదే మోడల్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు’ అని పేర్కొన్నాయి.

News December 18, 2025

ముంబై ‘జుగాడ్’.. జనం మెచ్చిన ఐడియా!

image

పైనున్న ఫొటో చూసి అవాక్కయ్యారా? ముంబైలో ఆకాశాన్నంటుతున్న అద్దెలను తట్టుకోలేక 20 మందికి పైగా వైద్యులు కలిసి ఇలా ఒకే చిన్న గదిని క్లినిక్‌గా మార్చుకున్నారు. ఒకేసారి అందరూ ఉండకుండా షిఫ్టుల వారీగా ఒకరి తర్వాత ఒకరు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఆ చిన్న గదే ఇప్పుడు అన్ని రకాల వైద్యులు దొరికే ‘మల్టీ స్పెషాలిటీ’ హాస్పిటల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో SMలో వైరల్ అవుతోంది.