News November 28, 2024
పృథ్వీ షా-యశస్వీ మధ్య అదే తేడా: మాజీ కోచ్

భారత క్రికెట్లో Next Big Thingగా ఒకప్పుడు పేరు దక్కించుకున్న పృథ్వీ షా జట్టులో చోటు కోల్పోవడం వెనుక కారణాలపై అతని Ex కోచ్ జ్వాలా సింగ్ స్పందించారు. ఆట తీరులో నిలకడలేనితనం, క్రమశిక్షణారాహిత్యం షాను క్రికెట్‌కు దూరం చేశాయన్నారు. ప్రారంభంలో రాణించినా దాన్ని కొనసాగించేందుకు ఆటతీరు మెరుగుపడాలన్నారు. నిలకడగా రాణిస్తున్న యశస్వికీ, షాకు అదే తేడా అని వివరించారు.
Similar News
News October 30, 2025
వర్షాలు – 90 రోజుల పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(1/2)

పత్తి పూత, కాయ ఏర్పడి, వృద్ది చెందే దశలో ఉంటే ముందుగా పొలంలో మురుగు నీటిని బయటకు తొలగించాలి. పంటలో చాళ్లను ఏర్పాటు చేసి మొక్కల్లో గాలి, కాంతి ప్రసరణ పెంచాలి. 2% యూరియా లేదా 2%పొటాషియం నైట్రేట్ లేదా 2% 19:19:19+ 1% మెగ్నీషియం సల్ఫేట్‌తో పాటు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. లీటరు నీటికి 5గ్రా. బోరాక్స్ కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.
News October 30, 2025
వర్షాలు- 90 రోజుల పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(2/2)

కాయకుళ్ళు నివారణకు లీటరు నీటికి 3గ్రా కాపర్ ఆక్సిక్లోరైడ్ +0.1గ్రా స్ట్రెప్టోసైక్లిన్ కలిపి మొక్కల కింది భాగపు కొమ్మలు, పచ్చటి కాయలు తడిచేలా పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు రాకుండా 3గ్రా. మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయరాలడం ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ప్లానోఫిక్స్(4.5% నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్) 0.25ml కలిపి పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.
News October 30, 2025
‘మహాకాళి’గా భూమికా శెట్టి

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న మహాకాళి సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మహాకాళిగా కన్నడ భామ భూమికా శెట్టి నటించనున్నారు. భూమికా శెట్టిని ‘మహా’గా పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈమె తెలుగులో ‘షరతులు వర్తిస్తాయి’ అనే చిత్రంలో హీరోయిన్గా నటించారు. PVCUలో తొలి లేడీ సూపర్ హీరోగా ఈమె కనిపించనున్నారు. ఈ మూవీకి పూజా అపర్ణ దర్శకత్వం వహించనున్నారు.


