News July 16, 2024
MBBSలో ఒకలా UPSCకి మరోలా!

ట్రెయినీ IAS పూజా ఖేడ్కర్ <<13637460>>MBBS సీటు<<>> కోసం సమర్పించిన ఫిట్నెస్ సర్టిఫికెట్లో తన వైకల్యం గురించి ప్రస్తావించలేదని ఆ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ బోరే వెల్లడించారు. ఆమె కుల/ నాన్- క్రిమి లేయర్ సర్టిఫికెట్ సమర్పించారన్నారు. UPSCకి సమర్పించిన అఫిడవిట్లో మాత్రం ఖేడ్కర్ దృష్టిలోపం ఉందని ఓ MRIని సమర్పించారు. దీనిని ఎనిమిది నెలల తర్వాత UPSC ఆమోదించింది.
Similar News
News December 14, 2025
మెస్సీ వెంట ఉన్న ప్లేయర్ల గురించి తెలుసా?

ఫుట్బాల్ స్టార్ మెస్సీతో, ఇద్దరు ప్లేయర్లు రోడ్రిగో డిపాల్(అర్జెంటీనా), లూయిస్ సువారెజ్(ఉరుగ్వే) భారత పర్యటనలో ఉన్నారు. వీరు US మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామికి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. మిడ్ ఫీల్డర్ అయిన రోడ్రిగో(RHS).. 2022లో ఫిఫా వరల్డ్కప్ గెలిచిన అర్జెంటీనా జట్టులో సభ్యుడు. మరో ప్లేయర్ సువారెజ్(LHS) స్ట్రైకర్గా పేరొందారు. యూరప్ లీగ్లో 2 సార్లు గోల్డెన్ బూట్ గెలుచుకున్నారు.
News December 14, 2025
INDvsSA.. గెలుపు ఎవరిదో?

టీ20 సిరీస్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా ఇవాళ టీమ్ ఇండియాతో దక్షిణాఫ్రికా మూడో మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచుల్లో చెరో విజయంతో ఇరు జట్ల ఫోకస్ ఈ మ్యాచ్ నెగ్గడంపైనే ఉంది. రెండో T20లో నెగ్గిన సఫారీ ప్లేయర్లు అదే జోష్లో ఉన్నారు. అటు ఓటమితో కంగుతిన్న టీమ్ ఇండియా ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని కసిగా ఉంది. మ్యాచ్ 7pm నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్లో లైవ్ చూడవచ్చు.
News December 14, 2025
రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <


