News September 20, 2024

YCPకి సామినేని ఉదయభాను రాజీనామా

image

AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, సరైన గుర్తింపు రాలేదని సామినేని అన్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా ఎల్లుండి ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.

Similar News

News October 28, 2025

BIG ALERT: కాకినాడ-యానాం మధ్య తీరాన్ని తాకిన తుఫాను

image

AP: మొంథా తుఫాను కాకినాడ-యానాం మధ్య తీరాన్ని తాకిందని APSDMA ప్రకటించింది. యానాం- అంతర్వేదిపాలెం దగ్గర తీవ్రమైన తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3-4 గంటలు పడుతుందని వెల్లడించింది. తీరప్రాంత జిల్లాల్లో గంటకు 90-100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News October 28, 2025

‘మొంథా’ తుఫాన్.. సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధం

image

* అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం 488 కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
* ఇప్పటికే 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
* పలు జిల్లాల్లో 219కి పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు
* అత్యవసర కమ్యూనికేషన్ కోసం 81 వైర్‌లెస్ టవర్లు ఏర్పాటు
* సహాయక చర్యలకు 321 డ్రోన్లు సిద్ధం, అందుబాటులో JCBలు, క్రేన్లు
* ఇప్పటికే 38 వేల హెక్టార్లలో పంట నష్టం, 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా

News October 28, 2025

రేపు ఈ జిల్లాల్లో సెలవు

image

AP: తుఫానుతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విజయనగరం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కోనసీమ, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కడప, తిరుపతి, నెల్లూరులో సెలవు ఇచ్చారు. అటు కాకినాడలో ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు నెల్లూరు, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు రేపు హాలిడే ప్రకటించారు.