News April 17, 2025
శాంసన్‌కు గాయం.. ఇప్పుడెలా ఉందంటే?

DCతో మ్యాచులో RR కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యారు. పక్కటెముకల్లో నొప్పి రావడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడారు. అయితే మ్యాచ్ అనంతరం తాను ప్రస్తుతానికి బాగానే ఉన్నట్లు సంజూ స్పష్టం చేశారు. ఇవాళ స్కానింగ్ జరిగాక గాయం తీవ్రతపై స్పష్టత వచ్చే అవకాశముంది. RR తన తర్వాతి మ్యాచును ఈనెల 19న LSGతో ఆడనుంది. ఆలోగా సంజూ కోలుకునే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News April 19, 2025
రేపే బీసీ గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

TG: బీసీ గురుకుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు రేపు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 109 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. మొత్తం 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు 26,884 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు.
News April 19, 2025
ఈ నెల 23న ‘పది’ ఫలితాలు?

AP: ఈ నెల 23న పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ల వ్యాల్యుయేషన్ కూడా పూర్తయ్యింది. విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కు 6,19,275 మంది హాజరయ్యారు. వీరిలో 5,64,064 మంది ఇంగ్లిష్ మీడియం, 51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాశారు. Way2Newsలోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 19, 2025
తిరుమల: దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండి టీబీసీ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. నిన్న 58,519 మంది స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.27 కోట్ల ఆదాయం సమకూరింది.