News April 6, 2025
చరిత్ర సృష్టించిన శాంసన్

IPL: నిన్న పంజాబ్పై గెలుపుతో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించారు. షేన్ వార్న్ను వెనక్కినెట్టి RR మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచారు. మొత్తం 62 మ్యాచ్ల్లో 32 విజయాలు సాధించారు. 2021లో సారథ్య బాధ్యతలు తీసుకున్న సంజూ ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్లకు కెప్టెన్సీ చేయలేదు. మరోవైపు ఐపీఎల్ తొలి సీజన్లోనే RRకు ట్రోఫీ అందించిన వార్న్ 55 మ్యాచ్ల్లో 31 విక్టరీలతో రెండో స్థానంలో ఉన్నారు.
Similar News
News January 5, 2026
మహబూబ్నగర్: పేదలకు వరం ‘గృహజ్యోతి’

నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గృహజ్యోతి’ పథకం వారికి ఒక వరమని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.3,593 కోట్ల మేర విద్యుత్ బకాయిలను చెల్లించిందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News January 5, 2026
శివ మానస పూజ ఎలా చేయాలి?

శివ మానస పూజ అంటే ఏ పూజా సామాగ్రి లేకుండా మనసులోనే పరమశివుడిని ఆరాధించడం. అందుకోసం ప్రశాంతమైన చోట కూర్చుని కళ్లు మూసుకోవాలి. హృదయమే రత్న సింహాసనమని, ఆత్మయే శివుడని భావించాలి. మనసులోనే గంగాజలంతో అభిషేకం, కల్పవృక్ష పుష్పాలతో అలంకరణ, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. పంచేంద్రియాలను శివుడికి అంకితం చేయాలి. ఈ మానసిక అర్చన అత్యంత శక్తిమంతమైనది. భౌతిక పూజా ద్రవ్యాలు అందుబాటులో లేకపోతే ఈ పూజను ఆచరించవచ్చు.
News January 5, 2026
కాండం తొలిచే పురుగుతో వరికి నష్టం ఎక్కువే..

కాండం తొలిచే పురుగు వరి నారుమడి నుంచి పంట ఈనె దశ వరకు ఆశించి నష్టం కలిగిస్తుంది. నారుమడి దశలో ఈ పురుగు మొక్క మువ్వలోకి రంద్రాలు చేసుకొని చొచ్చుకెళ్లి తినడం వల్ల మువ్వ గోధుమ రంగులోకి మారి మెలికలు తిరిగి ఎండి, మొక్కలు అధికంగా చనిపోతాయి. కాండం భాగాన్ని ఈ పురుగు తింటే మొక్కకు సరిపడ పోషకాలు అందక తెల్లకంకిగా మారి తాలు గింజలు ఏర్పడతాయి. కాండం తొలుచు పురుగు పంట నాణ్యత, దిగుబడిని ప్రభావితం చేస్తుంది.


