News April 24, 2024
శాంసన్‌ను టీమిండియా కెప్టెన్ చేయాలి: హర్భజన్

నిన్న ముంబైపై రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్, ఓపెనర్ జైస్వాల్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ‘ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం. యశస్వి ఆటే అందుకు నిదర్శనం. టీ20 వరల్డ్‌కప్‌లో కీపర్ ఎవరన్నదానిపై ఇక చర్చ అనవసరం. శాంసన్‌నే ఎంపిక చేయాలి. రోహిత్ తర్వాత కెప్టెన్‌గా అతడిని ప్రోత్సహించాలి’ అని అభిప్రాయపడ్డారు.
Similar News
News October 17, 2025
బంగారం, వెండి కొంటున్నారా?

ధన త్రయోదశి సందర్భంగా రేపు బంగారం, వెండి కొనుగోలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. అష్టైశ్వర్యాల అధినాయకురాలైన ధనలక్ష్మి కటాక్షం కోసం.. లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కొని, పూజించాలని సూచిస్తున్నారు. ఈరోజున కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే రాబోయే ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు కలగవని, సంపదకు లోటుండదని అంటున్నారు. ధనలక్ష్మి అనుగ్రహంతో కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
News October 17, 2025
రేపటి బంద్‌లో అందరూ పాల్గొనాలి: భట్టి

TG: BCలకు రిజర్వేషన్లపై నిర్వహించే బంద్‌లో అందరూ పాల్గొనాలని Dy.CM భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘BRS రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి BC కోటాను తగ్గించింది. మేం సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% కల్పించాం. బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదు. అందుకే రిజర్వేషన్ల పెంపు కోర్టుల్లో నిలిచిపోతోంది. BJP నైజం బయటపడింది. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు’ అని భట్టి అన్నారు.
News October 17, 2025
స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్(NMMSS-2026)కు దరఖాస్తు చేసేందుకు రేపే చివరి తేది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు రేపటి లోగా ఆన్లైన్లో పరీక్ష ఫీజు చెల్లించాలి. OCT 22లోగా ఆన్లైన్లో అప్లై చేసిన ఫామ్‌ను సంబంధిత పాఠశాల HMలు DEOలకు పంపించాల్సి ఉంటుంది. ఈ స్కీం ద్వారా ఆర్థికంగా వెనకబడిన మెరిట్ స్టూడెంట్స్‌కు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12వేల స్కాలర్షిప్ అందజేస్తారు.