News February 18, 2025
శామ్‌సంగ్ S24 Ultra ధర ₹70,000.. ఎక్కడంటే?

మొబైల్ ఫోన్ల ధరలను పోల్చినప్పుడు ఇండియాలో ఎక్కువగా ఉండటంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కంపెనీల ఫోన్ల ధరలు దుబాయ్‌లో తక్కువగా ఉంటాయంటారు. SAMSUNG కంపెనీకి చెందిన S24 Ultra (12/256 GB) ఫోన్ దుబాయ్‌లో సుమారు ₹70,000లకే లభిస్తుంది. అదే ఇండియాలో ₹1,04,999 (ఆన్‌లైన్ షాపింగ్ సైట్). దాదాపు ట్యాక్సుల రూపంలో ₹35,000 అధికంగా వసూలు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి.
Similar News
News March 12, 2025
ఎల్లుండి మద్యం షాపులు బంద్

హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ వెల్లడించింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.
News March 12, 2025
త్వరలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు

దేశంలో త్వరలో హైడ్రోజన్‌తో నడిచే రైలు అందుబాటులోకి రానుంది. హరియాణా జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడిచే ఈ ట్రైన్‌ను ఈ నెల 31న ప్రారంభించే అవకాశాలున్నాయి. గంటకు 140కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే దీని వాటర్ సామర్థ్యం 40వేల లీటర్లు. ఒకసారి ఫుల్ చేస్తే 1000కిలోమీటర్లు ప్రయాణించగలదు. దేశవ్యాప్తంగా 35రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ భావిస్తోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తయారు చేసింది.
News March 12, 2025
రేవంత్‌ని మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి: కేటీఆర్

TG: ప్రతిపక్షాల మరణం కోరుకోవటం సీఎం రేవంత్ నీచబుద్ధికి పరాకాష్ఠ అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయనను త్వరగా మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని లేకపోతే చుట్టుపక్కల వారికి ప్రమాదమని కుటుంబ సభ్యులకు సూచించారు. చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సీఎంకు ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.