News February 18, 2025

శామ్‌సంగ్ S24 Ultra ధర ₹70,000.. ఎక్కడంటే?

image

మొబైల్ ఫోన్ల ధరలను పోల్చినప్పుడు ఇండియాలో ఎక్కువగా ఉండటంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కంపెనీల ఫోన్ల ధరలు దుబాయ్‌లో తక్కువగా ఉంటాయంటారు. SAMSUNG కంపెనీకి చెందిన S24 Ultra (12/256 GB) ఫోన్ దుబాయ్‌లో సుమారు ₹70,000లకే లభిస్తుంది. అదే ఇండియాలో ₹1,04,999 (ఆన్‌లైన్ షాపింగ్ సైట్). దాదాపు ట్యాక్సుల రూపంలో ₹35,000 అధికంగా వసూలు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి.

Similar News

News May 7, 2025

‘రామాయణ’ ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే?

image

బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ ఫస్ట్ లుక్‌ను మే 1-4 మధ్య జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES)లో రిలీజ్ చేయనున్నారు. సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ సీతారాములుగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్ర పార్ట్-1ను వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

News May 7, 2025

నేటి నుంచి మహిళల ట్రై సిరీస్

image

ఇవాళ శ్రీలంక, దక్షిణాఫ్రికా, భారత్ మహిళా జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. లంక వేదికగా జరిగే ఈ టోర్నీలో అతిథ్య జట్టుతో నేడు టీమ్ ఇండియా తలపడనుంది. ఉ.10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. WPLలో సత్తా చాటి జట్టుకు ఎంపికైన కష్వీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. కాగా మ్యాచులు ఫ్యాన్ కోడ్‌లో ప్రసారం కానున్నాయి.

News May 7, 2025

ఫోకస్ అంతా కేసీఆర్ స్పీచ్‌పైనే..

image

TG: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ చీఫ్ KCR ఏం మాట్లాడుతారనే ఆసక్తి జనాల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కావడమే దీనికి ప్రధాన కారణం. అదే సమయంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గులాబీ బాస్ ఎలాంటి సందేశం, దిశానిర్దేశం చేస్తారనే చర్చ జరుగుతోంది. కాగా KCR సుమారు గంట పాటు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఎర్రవెల్లి నుంచి సా.5 గంటలకు సభాస్థలికి చేరుకుంటారని సమాచారం.