News July 29, 2024
ఒలింపిక్స్ అథ్లెట్లకు శాంసంగ్ స్పెషల్ గిఫ్ట్స్
పారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొంటున్న వివిధ దేశాల అథ్లెట్లకు Samsung కంపెనీ సర్‌ప్రైజ్ ఇస్తోంది. క్రీడాకారులకు స్పెషల్ గిఫ్టు ప్యాకులు అందించింది. ఇందులోని Samsung Galaxy Z Flip 6 ప్రత్యేక ఎడిషన్ ఫోన్‌ను ప్లేయర్లు పోడియం వద్దకు తీసుకెళ్లేందుకు నిర్వాహకులు అనుమతిచ్చారు. దీంతో ప్లేయర్లు గెలిచిన తర్వాత వారి మెడల్స్‌తో ఫ్లిప్ ఫోన్‌లో సెల్ఫీలు తీసుకోగా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
Similar News
News February 1, 2025
బహిరంగంగా దూషణ జరిగితేనే SC, ST కేసు: సుప్రీంకోర్టు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేర నిరూపణ జరగాలంటే బహిరంగంగా దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కేసుకు సంబంధించి నాలుగు గోడల మధ్య జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కోర్టు విచారించింది. అందరూ చూస్తుండగా ఘటన జరగలేదంటూ కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 3(1)(ఎస్) నిరూపితం కావాలంటే ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను కులం పేరుతో బహిరంగంగా దూషించి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.
News February 1, 2025
నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు
AP: నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. దీంతో కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 14250 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపు 170 వరకు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కార్‌కు ఏకంగా రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది.
News February 1, 2025
నేడే కేంద్ర బడ్జెట్
ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్‌లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది.