News August 11, 2024

సంయుక్తా మేనన్.. అందంలోనే కాదు సాయంలోనూ మిన్నే

image

అందం, అభినయంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న హీరోయిన్ సంయుక్తా మేనన్.. తన మానవత్వంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. 2018 కేరళ వరదల సమయంలో ఆర్థిక సాయం చేయడంతోపాటు స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల వయనాడ్ కోసమూ సాయం అందించారు. నిస్సహాయ స్త్రీలను ఆదుకునేందుకు ఆదిశక్తి ఫౌండేషన్ స్థాపించి సేవ చేస్తున్నారు. హీరోయిన్‌గా పొందిన ప్రేమను మనిషిగా తిరిగిస్తున్నానని ఆమె చెబుతున్నారు.

Similar News

News November 22, 2025

NZB: ఇద్దరు SIలకు VRకు బదిలీ

image

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన బదిలీల్లో ఇద్దరు SIలకు VRకు బదిలీ చేసి అంతలోనే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ పేరిట మళ్లీ స్టేషన్లకు అటాచ్ చేశారు. ఇందులో భాగంగా NZBరూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ-1గా పని చేసిన మహమ్మద్ ఆరిఫ్‌ను డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు, నవీపేట ఎస్ఐగా పనిచేస్తున్న వినయ్‌ను నిజామాబాద్ 6వ టౌన్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 22, 2025

భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.

News November 22, 2025

ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

image

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.