News July 8, 2024

శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య

image

శ్రీలంక క్రికెట్ టీమ్‌కు తాత్కాలిక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య నియమితులయ్యారు. ఇప్పటినుంచి సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌ పర్యటన వరకూ ఆయన కోచ్‌గా కొనసాగుతారని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఆయన ఆ జట్టుకు ఫుల్ టైమ్ క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. శ్రీలంకకు 445 ODI, 110 టెస్టులు, 31 T20ల్లో ప్రాతినిధ్యం వహించిన ఆయన మొత్తం 21,032 రన్స్ చేశారు. ఇందులో 42 సెంచరీలున్నాయి.

Similar News

News October 23, 2025

కోత ముప్పు తప్పించేలా తీరం వెంబడి ‘గ్రేట్ గ్రీన్ వాల్’

image

AP: రాష్ట్రంలోని 1,053 KM తీరం వెంబడి 5 KM వెడల్పుతో ‘గ్రేట్ గ్రీన్ వాల్’ నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. మల్టీ లేయర్ గ్రీన్ బఫర్‌ జోన్లుగా ఇది ఉంటుంది. దీనివల్ల తుఫాన్ల నుంచి తీర రక్షణ, స్థిరమైన మత్స్య సంపద వృద్ధితో 30 లక్షల మంది ఉపాధి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కేంద్ర పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల సహకారంతో అంతర్జాతీయ సంస్థల నుంచి, campa, nregsల ద్వారా నిధులు సమకూర్చనున్నారు.

News October 23, 2025

ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలు

image

ప్రతి ఏటా ఇన్‌స్టాగ్రామ్‌ అందించే ‘గ్లోబల్‌ గోల్డన్‌ రింగ్‌’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్‌ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్‌ ద్వారా స్థానిక సంస్కృతిని చాటే వారికి ఇన్‌స్టాగ్రామ్‌ ఈ అవార్డును అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 25మందిని ఎంపిక చేయగా అందులో డాలీసింగ్ స్థానం సంపాదించారు. 1.6 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌తోపాటు నటిగానూ పేరు పొందింది.

News October 23, 2025

391 కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

image

BSF స్పోర్ట్స్ కోటాలో 391 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఇంటర్ విద్యార్హతతోపాటు నేషనల్, ఇంటర్నేషన్ గేమ్స్‌లో రాణించిన వారు అర్హులు. వయసు 18-23ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబర్ 4. PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/