News July 5, 2024
త్వరలో ఇసుక కాంట్రాక్టులు రద్దు?

AP: YCP హయాంలో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన ఇసుక కాంట్రాక్టులను రద్దు చేయాలని TDP ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఒప్పందాలను ఉల్లంఘించి ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకేసీ పర్యావరణ విధ్వంసానికి పాల్పడటమే కారణాలుగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారులు నోటీసులు ఇస్తారని సమాచారం. కాగా ఈ నెల 8 నుంచి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఇకపై <<13561181>>రూ.88కే<<>> టన్ను ఇసుక అందనుంది.
Similar News
News November 26, 2025
రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి ఒంటిమిట్ట, సిద్దవటం

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాజంపేట నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే డివిజన్లోకి చేరనున్నాయి. ఈ నిర్ణయానికి మంత్రి వర్గం నేడు ఆమోదం తెలపనుంది. ఆ వెంటనే ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు.
News November 26, 2025
నేటి నుంచి మౌఢ్యమి.. శుభ కార్యాలు ఎందుకు చేయకూడదంటే?

ఈరోజు నుంచి మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఇది వచ్చే ఏడాది FEB 17 వరకు 83 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజుల్లో గురు, శుక్ర గ్రహాలు సూర్యుడి దగ్గరి వరకు వెళ్లడంతో వాటి శక్తి తాత్కాలికంగా క్షీణిస్తుంది. అయితే శుభ కార్యాలకు ఈ గ్రహాల బలం అవసరం. ఆ బలం తగ్గినప్పుడు శుభ కార్యాలు చేస్తే ఫలితం ఉండదని నమ్ముతారు. ☞ మౌఢ్యమి రోజుల్లో ఏయే పనులు చేయవచ్చు, వేటిని చేయకూడదో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.