News February 14, 2025

ఇసుక.. ఇకపై 24 అవర్స్ ఆన్‌లైన్ బుకింగ్

image

TG: నేటి నుంచి ఇసుక 24 గంటల ఆన్‌లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. రీచ్‌లు, డంపింగ్ యార్డుల నుంచి అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధిక లోడ్ లారీలను అనుమతించవద్దని సూచించారు. వివిధ ప్రాజెక్టులకు ఇసుక వినియోగంపై వివరాలను మార్చి 31లోపు సమర్పించాలని జాతీయ రహదారులు, R&B, TGMSIDC, సాగునీటి, పంచాయతీరాజ్ శాఖలను కోరారు.

Similar News

News November 10, 2025

6 గంటల్లోనే జీవ వ్యర్థాల నుంచి జీవ ఎరువుల తయారీ

image

జీవవ్యర్థ పదార్థాలను జీవ ఎరువులుగా మార్చే పరిశ్రమ త్వరలో HYDలోని ప్రొ.జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు వియత్నాంకు చెందిన జీవ ఎరువుల తయారీ సంస్థ ‘బయోవే’తో.. వర్సిటీ ఒప్పందం చేసుకుంది. రూ.5 కోట్లతో ఈ ఎరువుల యూనిట్‌ను 2 నెలల్లోనే ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించనున్నారు. జీవవ్యర్థాల నుంచి 6 గంటల్లోనే జీవ ఎరువులను తయారు చేయవచ్చని ‘బయోవే’ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

News November 10, 2025

విదేశాల్లో పిల్లలు.. కుమిలిపోతున్న తల్లిదండ్రులు!

image

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసం యువత విదేశాలకు వెళ్లడం సర్వసాధారణమైంది. ప్రారంభంలో ఏడాదికోసారి పిల్లల వద్దకు ఉత్సాహంగా వెళ్లే తల్లిదండ్రులు వయసు పెరిగే కొద్దీ (60+) సుదీర్ఘ ప్రయాణాలు, ఆరోగ్య సమస్యల కారణంగా వెళ్లడం మానేస్తున్నారు. అయితే ఉద్యోగాలు, వీసా సమస్యలతో పిల్లలు కూడా ఇండియాకు రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రమైన ఒంటరితనానికి లోనవుతూ కుమిలిపోతున్నారు. చివరి రోజుల్లోనూ పిల్లల ప్రేమ పొందలేకపోతున్నారు.

News November 10, 2025

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 32 పోస్టులు

image

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌(<>DIC<<>>) 32 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BBA, BSc, B.Tech/B.E, డిప్లొమా, MSc, ME/M.Tech, MBA/PGDM, MSW ఉత్తీర్ణులై ఉండాలి. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dic.gov.in/