News September 11, 2024
నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్

AP: ఇవాళ్టి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ శాండ్ పోర్టల్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50 శాతం ఛార్జీలు పెంచాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్‌కు తొలి 10 కి.మీకు రూ.547 వసూలు చేయనున్నట్లు సమాచారం.
Similar News
News February 2, 2026
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు FEB 25 వరకు గడువు

JEE మెయిన్ తుది విడత పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. తుది విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీల మధ్య జరగనున్నాయి. జేఈఈ తొలి విడత పరీక్షలు జనవరి 29తో ముగిశాయి. వీటి ఫలితాలను ఈ నెల 12వ తేదీలోపు వెల్లడించనున్నారు.
News February 2, 2026
కంది మొక్కలను వరి పొలం గట్లపై పెంచితే ఏమిటి లాభం?

AP: కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి సాగు చేస్తున్న పొలాల గట్లపై రైతులు కందిని సాగు చేస్తున్నారు. దీని వల్ల కంది పంట పొలం తయారీకి, పురుగు మందుల కోసం చేసే ఖర్చు ఉండదు. వరికి పెట్టే నీటినే కంది మొక్కలు పీల్చుకొని పెరుగుతాయి. వరి పూత దశలో ఆశించే పురుగులను కంది ఆకర్షించి ఎర పైరుగా పని చేస్తుంది. రైతులకు రెండు పంటల దిగుబడి వస్తుంది. ఇలా పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది విత్తనాలను అందిస్తోంది.
News February 2, 2026
హైదరాబాద్‌లోని IIMRలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


