News April 27, 2024
‘సందేశ్‌ఖాలీ రైడ్స్’.. ఈసీని ఆశ్రయించిన తృణమూల్

ఎన్నికల వేళ తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సీబీఐ, NSG సందేశ్‌ఖాలీలో ఫేక్ రైడ్లు నిర్వహించాయని ఆరోపిస్తూ తృణమూల్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా CBI రైడ్లు నిర్వహించింది. ఈ ఆయుధాలు ఎక్కడ దొరికాయో స్పష్టత లేదు. వాటిని సీబీఐ/ఎన్ఎస్జీనే పెట్టి ఉండొచ్చు’ అని పేర్కొంది. అంతకుముందు ఈ రైడ్లపై స్పందించిన BJP.. తృణమూల్‌ను ఓ ఉగ్రవాద సంస్థగా అభివర్ణించింది.
Similar News
News November 24, 2025
మహిళల పేరున సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం: సీతక్క

భూపాలపల్లి జిల్లాలో మహిళా సంఘాలకు ఇప్పటివరకు 6 బస్సులను ఇచ్చామని, వారికి నెలకు రూ.70 వేల వరకు ఆదాయం వస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతూ.. మూడున్నర ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మహిళల పేరున మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.6 కోట్ల వడ్డీలేని రుణాన్ని అందిస్తామన్నారు.
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్‌కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.
News November 24, 2025
ఎల్లుండి ఇలా చేస్తే వివాహ సమస్యలు దూరం!

ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఈరోజున సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్త్రోత్ర పారాయణం, వల్లీ-దేవసేన కళ్యాణం వంటివి చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇవి చేస్తే జాతక పరంగా వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, పిల్లల బుద్ధి కుశలత, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. SHARE IT


