News February 2, 2025
సంధ్య థియేటర్ తొక్కిసలాట.. విదేశాలకు శ్రీతేజ్?

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్లాల్సి వస్తే ఖర్చు తానే భరిస్తానని వైద్యులతో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 4న గాయపడ్డ శ్రీతేజ్ రెండు నెలలు కావొస్తున్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ట్యూబ్ ద్వారానే లిక్విడ్ ఫుడ్ అందిస్తున్నారు.
Similar News
News November 15, 2025
రెండో రోజు CII సదస్సు ప్రారంభం

AP: విశాఖలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న రేమండ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇవాళ దేశ విదేశాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అవుతారు.
News November 15, 2025
తన గమ్యమేంటో జడేజాకు తెలుసు: రవిశాస్త్రి

తన ఫ్యూచర్(IPL)పై బయట జరుగుతున్న చర్చతో ఆల్‌రౌండర్ జడేజా ఫోకస్ దెబ్బతిందన్న వ్యాఖ్యలపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ‘అతని తర్వాతి డెస్టినేషన్, సంపాదన ఎంత అనే అంశాలపై అంతా ఆసక్తిగా ఉంటారు. జడేజా ఎంతో అనుభవజ్ఞుడు. టాప్ క్లాస్ క్రికెటర్. తన గమ్యం, క్రికెట్‌పై చాలా ఫోకస్డ్గా ఉంటాడు. బయట విషయాలు క్రికెట్‌పై అతనికున్న ఫోకస్‌ను దెబ్బతీయలేవు’ అని SAతో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అన్నారు.
News November 15, 2025
కాకరలో బూడిద తెగులు.. నివారణకు సూచనలు

వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కాకర పంటలో బూడిద తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పంటకు ఈ తెగులు సోకితే ఆకులపై బూడిద వంటి పొర ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైనోకాప్ 2 మి.లీ (లేదా) మైక్లోబ్యుటానిల్ 0.4 గ్రాములను కలిపి 7 నుంచి 10 రోజుల్లో 2, 3 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


