News December 29, 2024
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ సమాధానమిదే
TG: ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటపై పోలీసుల షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ స్పందించింది. ‘‘పుష్ప 2’ కోసం 4, 5 తేదీల్లో మైత్రీ మూవీస్ బుక్ చేసుకుంది. మా థియేటర్కు అన్ని అనుమతులు ఉన్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. చాలామంది హీరోలు ఇక్కడికి వచ్చినా ఇలాంటివి జరగలేదు. ఫ్యాన్స్ చొచ్చుకురావడంతోనే తొక్కిసలాట జరిగింది. 45 ఏళ్లుగా మేం థియేటర్ను నడిపిస్తున్నాం’ అని నోటీసుల్లో పేర్కొంది.
Similar News
News January 1, 2025
BREAKING: ఫలితాలు విడుదల
వివిధ పరీక్షల ఫలితాలను IBPS రిలీజ్ చేసింది. CRP RRBs ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1, ఆఫీసర్ స్కేల్-2, ఆఫీసర్ స్కేల్-2(SO), ఆఫీసర్ స్కేల్-3 ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఇక్కడ <
News January 1, 2025
దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు కొత్త ఏడాది సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు.
News January 1, 2025
BJP తప్పులకు మద్దతిస్తారా: RSSకు కేజ్రీవాల్ లేఖ
ఎన్నికలు సమీపించే కొద్దీ ఢిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో BJP చేసిన తప్పులకు సంఘ్ మద్దతిస్తుందా అంటూ RSSకు అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ‘BJP నేతలు బాహాటంగా డబ్బులు పంచుతున్నారు. ఓట్ల కొనుగోలుకు సంఘ్ మద్దతిస్తోందా? దళితులు, పూర్వాంచలీ ఓట్లను భారీగా తొలగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ప్రజాస్వామ్యాన్ని BJP బలహీన పరుస్తోందని RSS భావించడం లేదా’ అని లేఖలో ప్రశ్నించారు.