News October 29, 2025
పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలి: CBN

AP: వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని వేగంగా చేపట్టాలని CM CBN ఆదేశించారు. నీరు నిలవకుండా డ్రైనేజీల్ని పటిష్ఠం చేయాలన్నారు. విద్యుత్తు సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లోని వారికి నిత్యావసరాలు అందించాలన్నారు. కాగా రాష్ట్రంలో 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లోని 18 లక్షల మందిపై తుఫాను ప్రభావం పడిందని అధికారులు వివరించారు.
Similar News
News October 29, 2025
NVIDIA సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి కంపెనీ

అమెరికన్ టెక్ కంపెనీ NVIDIA సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకున్న తొలి కంపెనీగా రికార్డుల్లోకి ఎక్కింది. $4 ట్రిలియన్ వాల్యూను చేరుకున్న 3 నెలల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. $500B విలువైన AI చిప్ ఆర్డర్లు వచ్చాయని, US ప్రభుత్వం కోసం 7 సూపర్ కంప్యూటర్లు నిర్మిస్తున్నామని కంపెనీ CEO జెన్సెన్ హువాంగ్ చేసిన ప్రకటనతో షేర్లు భారీగా ఎగిశాయి.
News October 29, 2025
రూ.303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని ఆదేశం

TG: పెండింగ్‌లో ఉన్న SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలన్నారు. దీనివల్ల ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందుతుందని, వారి మానసిక ఒత్తిడి తగ్గుతుందని భట్టి పేర్కొన్నారు.
News October 29, 2025
ఈ మార్గాల్లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచనున్న రైల్వే

గుంటూరు-పగిడిపల్లి, మోటమర్రి(ఖమ్మం)-విష్ణుపురం(నల్గొండ) సెక్షన్ల మధ్య విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచడానికి రైల్వే ఆమోదం తెలిపింది. రూ.188 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో దీనిని పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మార్గాలు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సరకు, ప్యాసింజర్ రైళ్ల సేవలను మరింత వేగవంతం చేయనున్నాయి.


