News August 9, 2024
వీసా రద్దుపై స్పందించిన సంజయ్ దత్

సన్ ఆఫ్ సర్దార్ -2 షూటింగ్ కోసం UK వెళ్లాల్సిన స్టార్ నటుడు సంజయ్ దత్ వీసా రద్దు కావడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీసా మంజూరు చేసిన ఒక నెల తరువాత సంజయ్ జైలు జీవితం కారణంగా చూపుతూ యూకే ప్రభుత్వం వీసా రద్దు చేసింది. అన్ని పేమెంట్స్ జరిగాక, ఇప్పుడు రద్దు చేయడం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. అయినా అల్లర్లు జరుగుతున్న UKకు ఎవరు వెళ్తారని వ్యాఖ్యానించారు.
Similar News
News April 10, 2026
ముద్దు ముచ్చట తీరకముందే బకెట్ తన్నేస్తారా?

పెళ్లి, పిల్లల ముద్దుముచ్చట్లు, రిటైర్మెంట్ లైఫ్.. ఇవన్నీ అనుభవించాల్సిన జీవితాన్ని నేటి యువత చేజేతులా నాశనం చేసుకుంటోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘గంటల తరబడి కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్, ఒత్తిడి తగ్గాలని స్మోకింగ్, నిద్ర కోసం మద్యం సేవించడం ప్రాణాంతకం. సంపూర్ణమైన జీవితం గడపాలంటే తక్షణమే జీవనశైలి మార్చుకోండి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి’ అని డాక్టర్లు సూచిస్తున్నారు.
News April 10, 2026
ఒకే రోజు రూ.2,950కోట్లు రిలీజ్.. అకౌంట్లలోకి డబ్బులు: TDP

AP: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ చేసిన దుర్మార్గం నుంచి కూటమి ప్రభుత్వం బయట పడేస్తోందని TDP తెలిపింది. CM ఆదేశాలతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే రోజు రూ.2,950CR విడుదల చేసినట్లు వివరించింది. పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమైనట్లు చెప్పింది. అటు సర్వీస్‌లో ఉన్న పోలీసుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులూ మొదలైనట్లు ఓ అకౌంట్లో డబ్బులు పడిన ఫొటోను ట్వీట్ చేసింది.
News April 10, 2026
ఇంట్లో నోట్ల కట్టలు.. జస్టిస్ వర్మ రాజీనామా

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రిజైన్ లెటర్‌ను పంపారు. గతేడాది ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో భారీగా <<17379382>>డబ్బు కట్టలు<<>> బయట పడిన విషయం తెలిసిందే.


