News February 3, 2025

సంజూకు గాయం.. 6 వారాలు ఆటకు దూరం!

image

ఇంగ్లండ్‌తో 5వ టీ20లో ఆర్చర్ వేసిన బంతి సంజూ శాంసన్ చూపుడు వేలికి తగిలి గాయమైన విషయం తెలిసిందే. నొప్పితో అతను వికెట్ కీపింగ్‌కు కూడా రాలేదు. కాగా, శాంసన్ వేలికి ఫ్రాక్చర్ అయిందని 4-6 వారాల పాటు బ్యాట్ పట్టలేరని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విశ్రాంతి తీసుకొని నేరుగా మార్చిలో ప్రారంభమయ్యే IPL ఆడొచ్చని పేర్కొన్నాయి. సంజూ ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదు.

Similar News

News November 8, 2025

ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ఎంతంటే..

image

ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపాన్ ఉత్పత్తి చేస్తోంది. ‘కిన్మెమై ప్రీమియం’ రకం బియ్యం ధర KG ₹12,500 పలుకుతోంది. 2016లో 840 గ్రా.కు ₹5,490 ధరతో ఖరీదైన బియ్యంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం గమనార్హం. ప్రపంచంలోనే విలువైన, ఉత్తమమైన ధాన్యాలు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ వల్ల వీటికి ఇంత విలువ. వడ్లను వివిధ దశల్లో బియ్యంగా మారుస్తారు. కడగాల్సిన అవసరం లేకుండానే వండుకోగలగడం మరో స్పెషాలిటీ.

News November 8, 2025

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో బుమ్రా

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. మరో వికెట్ తీస్తే మూడు ఫార్మాట్లలో 100కు పైగా వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలవనున్నారు. అలాగే టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్ కానున్నారు. 50 టెస్టుల్లో 226, 89 వన్డేల్లో 149, 79 టీ20ల్లో 99 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. కాగా ఆసీస్, ఇండియా మధ్య చివరిదైన ఐదో టీ20 రేపు జరగనుంది.

News November 7, 2025

ఈ పొజిషన్‌లో నిద్రపోతున్నారా?

image

నిద్రపోయే సమయంలో పడుకునే పొజిషన్ చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముడుచుకుని లేదా బోర్లా పడుకోవడం వల్ల వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బోర్లా పడుకుంటే మెడ కండరాలపై, నడుముపై ఒత్తిడి పడుతుందని పేర్కొంటున్నారు. ఇక మోకాళ్లను ముడుచుకుని ఒక వైపుకు పడుకోవడం వల్ల దీర్ఘకాలిక వెన్ను నొప్పులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వెల్లకిలా లేదా ఎడమవైపుకు తిరిగి పడుకోవాలంటున్నారు.