News October 13, 2024

సంజూ శాంసన్ సెల్ఫ్‌లెస్ ప్లేయర్: సూర్య

image

వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెల్ఫ్ లెస్ క్రీడాకారుడు అని టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. సెంచరీ ముందు కూడా బౌండరీ బాదడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ‘నాకు నిస్వార్ధపరులైన ఆటగాళ్లతో కూడిన జట్టు అంటే ఇష్టం. ఎవరైనా 49 లేదా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ కోసం ప్రయత్నించి జట్టు ప్రయోజనాలు దెబ్బ తీయొద్దు. పరుగులు సాధించే క్రమంలో రికార్డులు వాటంతటవే రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 15, 2025

Where is my Train యాప్ సృష్టికర్త ఇతడే!

image

ఒకప్పుడు రైలు ఎక్కడుందో తెలియక స్టేషన్‌లలోనే గంటల తరబడి ఎదురుచూసేవాళ్లం. కానీ ‘Where is my Train’ యాప్ వచ్చాక లైవ్ స్టేటస్‌ను తెలుసుకోగలుగుతున్నాం. ‘సిగ్మాయిడ్ ల్యాబ్స్’ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ యాప్‌ను 2018లో గూగుల్ కొనుగోలు చేసింది. అహ్మద్ నిజాం మొహైదీన్ తన టీమ్‌తో కలిసి ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. సాధారణ సమస్యను పరిష్కరించడంతో ఈ కంపెనీ విలువ ₹320 కోట్లు దాటింది. మీరూ ఈ యాప్ వాడతారా?

News November 15, 2025

ప్రజాస్వామ్య విలువలు పతనం: జగన్

image

AP: హిందూపురంలోని YCP కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు <<18297222>>దాడి<<>> చేశారని జగన్ ట్వీట్ చేశారు. ‘ఈ అనాగరిక చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నీచర్, అద్దాలను పగలగొట్టడం, కార్యకర్తలపై దాడి చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తాయి’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుందని అన్నారు.

News November 15, 2025

SBI కస్టమర్లకు BIG ALERT

image

SBI కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30 తర్వాత ఆన్‌లైన్, యోనో లైట్ ద్వారా డబ్బును పంపే, క్లెయిమ్ చేసే mCASH సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. UPI, IMPS, NEFT, RTGS తదితర డిజిటల్ పేమెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. లబ్ధిదారుడిని ముందుగా రిజిస్టర్ చేయకుండానే మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ద్వారా డబ్బు లావాదేవీలు చేయడం కోసం mCASHను గతంలో SBI తీసుకొచ్చింది.