News October 12, 2024

సంజూ శాంసన్ సూపర్ సెంచరీ

image

ఉప్పల్‌లో బంగ్లాదేశ్‌పై సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కేవలం 40 బంతుల్లోనే సూపర్ సెంచరీ చేశారు. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో 5 సిక్సులు బాదారు. మొత్తంగా 8 సిక్సులు, 9 ఫోర్లు కొట్టారు. మరోవైపు కెప్టెన్ సూర్య కూడా 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో టీమ్ ఇండియా 12.1 ఓవర్లు ముగిసేసరికి 183 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మిగిలున్న నేపథ్యంలో స్కోర్ ఎంత చేయొచ్చో కామెంట్ చేయండి.

Similar News

News October 22, 2025

భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది: రేణూ దేశాయ్

image

రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకునే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనని, జాగ్రత్తగా ఖర్చు పెడతానని తెలిపారు. ఆధ్యాత్మికతకు ప్రియారిటీ ఇస్తానని తెలిపారు. గతంలో రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె <<16044331>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

News October 22, 2025

బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్

image

సీనియర్ సిటిజన్(60 ఏళ్లు పైబడిన) నూతన యూజర్ల కోసం BSNL కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.1,812తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు అందించనుంది. దీంతోపాటు BiTV సబ్‌స్క్రిప్షన్ 6 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వచ్చే నెల 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు కొత్త యూజర్లకు రూ.1కే <<18014372>>రీఛార్జ్<<>> ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News October 22, 2025

అక్టోబర్ 22: చరిత్రలో ఈరోజు

image

1901: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి
1998: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ మరణం
2001: సినీ నటుడు రామకృష్ణ మరణం
2008: చంద్రుడి పైకి మానవరహిత చంద్రయాన్-1ను ప్రయోగించిన ఇస్రో
➣అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం