News July 25, 2024
సంజూకు మళ్లీ వన్డేల్లో అవకాశం వస్తుంది: ఉతప్ప

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో చోటు దక్కలేదని సంజూ శాంసన్ నిరాశ చెందక్కర్లేదని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నారు. అతనికి మళ్లీ ఛాన్స్ వస్తుందని చెప్పారు. సంజూకు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి కాదని, అలాగని ఇదే చివరి సారి అని చెప్పలేమన్నారు. ప్రతీ క్రికెటర్ ఈ పరిస్థితిని ఎదుర్కోక తప్పదన్నారు. కొత్త నాయకత్వం కుదురుకుంటే సంజూకు అవకాశం వస్తుందని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 19, 2025
2030 నాటికి కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు

మన దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC) ద్వారా వచ్చే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ‘GCCల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుంది’ అని NLB సర్వీసెస్ రిపోర్టు వెల్లడించింది. దేశంలో 1800కు పైగా GCCల్లో ఏఐ నిపుణులకు ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్లో ఈ ఏడాది 41 GCCలు ఏర్పాటయ్యాయి.
News November 19, 2025
రైతులకు గుడ్న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

AP: ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత సాయం రైతుల ఖాతాల్లో జమ కానుంది. 46,85,838 మంది ఖాతాల్లో రూ.7,000 చొప్పున మొత్తం రూ.3,135 కోట్లను సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. కడప(D) పెండ్లిమర్రిలో మ.2గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ సాయాన్ని నేడు రిలీజ్ చేస్తారు.
News November 19, 2025
RGM: ‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి: సీపీ

‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజల సహకారం అత్యంత అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా, అమ్మకం వంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీపీ పిలుపునిచ్చారు.


