News December 2, 2024
ఇంటర్ విద్యార్థుల కోసం ‘సంకల్ప్’

AP: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ‘సంకల్ప్-2025’ అనే కార్యక్రమాన్ని విద్యామండలి రూపొందించింది. క్వార్టర్లీ పరీక్షల్లో ఫెయిలైన స్టూడెంట్లను ప్రోత్సహించేందుకు లెక్చరర్లు, ఇతర సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించింది. వీరికి ప్రత్యేకంగా క్వశ్చన్ బ్యాంకులు ఇస్తారు. ప్రతి రోజూ సా.3 నుంచి 5గంటల వరకు స్టడీ అవర్లు నిర్వహిస్తారు. ఇవాళ్టి నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది.
Similar News
News January 21, 2026
MHBD: నేటి నుంచి జంతుగణన!

జిల్లాలో జంతు సంపాదన శాస్త్రీయంగా అంచనా వేసే దిశగా అటవీ శాఖ బుధవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. జిల్లా అటవీ శాఖ అధికారి విశాల్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని అటవీ రేంజ్ పరిధిలో గణన ప్రారంభం కానుంది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ జంతువుల లెక్కింపు కార్యక్రమం ఈసారి నూతన AI టెక్నాలజీతో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, డ్రోన్ విధానాలను వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News January 21, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరులోని <
News January 21, 2026
నెలసరిలో ఏం తినాలంటే..?

చాలామంది మహిళలు పీరియడ్స్‌లో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజా, యాప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.


