News January 17, 2025

సంక్రాంతి ఎఫెక్ట్.. రూ.400 కోట్ల మద్యం తాగేశారు!

image

AP: రాష్ట్రంలో పండుగ 3 రోజుల్లో దాదాపు ₹400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో ₹150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు ₹80కోట్ల సేల్ జరుగుతుండగా, ఈ 3 రోజుల్లో ₹160cr అదనంగా అమ్ముడైంది. ఈనెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసుల లిక్కర్, 2.29L కేసుల బీరు అమ్ముడైంది. గతంలో సంక్రాంతికి ఎప్పుడూ ఈ రేంజ్‌లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.

Similar News

News January 17, 2025

ఈ నెలలోనే ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల పెంపు!

image

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్లు ‘మనీకంట్రోల్’ తెలిపింది. జనవరి 2025 నుంచి వార్షిక వేతనాలు 6-8 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత మళ్లీ APRలో జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ప్రస్తుతం అందులో 3.23 లక్షల ఉద్యోగులు ఉన్నారు.

News January 17, 2025

మంచు మనోజ్ దంపతులపై కేసు నమోదు

image

AP: మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనికపై చంద్రగిరి పీఎస్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా MBUలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారని మోహన్ బాబు పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మరోవైపు తమపై దాడి చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు పీఏతో పాటు మరో 8 మంది సిబ్బందిపై కేసు నమోదైంది.

News January 17, 2025

అలా చేస్తే నిర్మాతలకు బర్డెన్: అనిల్ రావిపూడి

image

సినిమా చిత్రీకరణపై డైరెక్టర్ అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క మూవీని 3-5 నెలల్లో పూర్తిచేస్తానని తెలిపారు. ‘రోజుకు రూ.20-25 లక్షలు ఖర్చు అవుతాయి. అందుకే సినిమాటోగ్రాఫర్‌కు ముందే హైలైట్స్‌ ఏవో చెప్తా. క్వాలిటీ కోసం ఏంకావాలో అదే చేయండని సూచిస్తా. సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా 70 రోజుల్లో పూర్తిచేశా. ఎక్కువ రోజులు తీస్తే ప్రొడ్యూసర్‌కు ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుతుంది’ అని తెలిపారు.