News January 7, 2025
సంక్రాంతి సినిమాలు.. ఏ ట్రైలర్ నచ్చింది?
సంక్రాంతికి ఈ సారి టాలీవుడ్‌లో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉన్నాయి. రామ్ చరణ్ నటించిన ‘<<15045920>>గేమ్ ఛేంజర్<<>>’ ఈ నెల 10న, బాలకృష్ణ ‘<<15069637>>డాకు మహారాజ్<<>>’ 12న, వెంకీ మామ ‘<<15081100>>సంక్రాంతికి వస్తున్నాం<<>>’ 14న విడుదల కానున్నాయి. ఈ క్రమంలో విడుదలైన ట్రైలర్లు చూస్తే ఆయా సినిమాలు వేర్వేరు కథాంశాలతో తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. మరి వీటిలో మీకు ఏ ట్రైలర్ నచ్చిందో కామెంట్ చేయండి?
Similar News
News January 8, 2025
చనిపోయిన జవాన్లలో ఐదుగురు మాజీ మావోలు
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో సోమవారం మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో 8 మంది జవాన్లు చనిపోయిన <<15079768>>విషయం<<>> తెలిసిందే. అయితే వీరిలో ఐదుగురు మాజీ మావోయిస్టులని పోలీసులు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోలను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లుగా పోలీసు శాఖ నియమించుకుంటుంది. అలా చేరిన బయన్ సోధీ, పండరురామ్ పొయం, డుమ్మా మార్కం, బుద్రామ్ కొర్పా, సోమడు వెట్టి ఈ ఘటనలో చనిపోయారు.
News January 8, 2025
‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడుతోందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఆపేశామని, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అటు నిన్న ఉదయం శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్ పరామర్శించిన విషయం తెలిసిందే. గత నెల 4న జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడగా అతడి తల్లి రేవతి చనిపోయారు.
News January 8, 2025
కుంభమేళాలో తిరుమల శ్రీవారి ఆలయం
UPలోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళాలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేయనున్నట్లు TTD ఈవో శ్యామలరావు తెలిపారు. JAN 13- FEB 26 వరకు కుంభమేళాకు వచ్చే కోట్లాది మందికి శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 6, బజరంగ్ దాస్ రోడ్డులోని నాగవాసుకి గుడికి సమీపంలో 2.89ఎకరాలలో ఆలయం నిర్మించనున్నట్లు చెప్పారు. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అన్ని సేవలు జరుగుతాయని తెలిపారు.