News May 19, 2024
రేషన్ దుకాణాల్లో త్వరలో సన్నబియ్యం పంపిణీ?
TG: రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను CM రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. సన్నాలు, దొడ్డు రకం ఏ మేరకు సాగవుతోంది? ఇప్పుడున్న వినియోగమెంత? అనే వివరాలు సిద్ధం చేయమన్నారట. సన్నబియ్యం పంపిణీతో రైతులకు మంచి ధర లభిస్తుందని, రేషన్ బియ్యం రీసైక్లింగ్, అక్రమ రవాణాకూ అడ్డుకట్ట వేయొచ్చని సర్కార్ భావిస్తోంది.
Similar News
News December 23, 2024
సన్నీలియోన్ పేరిట అకౌంట్.. నెలకు రూ.1000
నటి సన్నీలియోన్ పేరిట అకౌంట్ క్రియేట్ చేసిన ప్రబుద్ధుడు నెలనెలా రూ.1000 పొందుతున్నాడు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పెళ్లైన మహిళలకు ‘మహతారి వందన్ యోజన’ పేరుతో ప్రతి నెలా అకౌంట్లో రూ.వెయ్యి జమ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న వీరేందర్ జోషి ఫేక్ ఖాతాతో మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంట్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ పథకంలో 50% ఫేక్ అకౌంట్లు ఉన్నాయని BJP సర్కారుపై కాంగ్రెస్ విమర్శించింది.
News December 23, 2024
నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా: నటుడు
అల్లు అర్జున్ కేసుపై పోలీసులు ఇచ్చిన వివరణ తర్వాత నటుడు రాహుల్ రామకృష్ణ Xలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘ఇటీవల జరిగిన ఘటనల గురించి నిజంగా నాకు తెలియదు. అందుకే గతంలో చేసిన స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, లా అండ్ ఆర్డర్ వైఫల్యాన్ని ఓ వ్యక్తి చేసిన తప్పుగా పరిగణించడం సరికాదని ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
News December 23, 2024
STOCK MARKETS: లాభాల్లో పరుగులు..
గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్మార్కెట్లు పుంజుకున్నాయి. డాలర్ బలం తగ్గడం, మంచి షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. సెన్సెక్స్ 78,682 (+637), నిఫ్టీ 23,773 (+194) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్కేర్ షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్ పెరిగింది. SHRIRAMFIN, JSWSTEEL, HDFC BANK టాప్ గెయినర్స్.