News November 19, 2024
సన్నబియ్యం పంపిణీ ఆలస్యం!
TG: రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని అధికారులు తెలిపారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో ఉగాది నుంచి ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉంది.
Similar News
News November 19, 2024
‘ఇన్స్టాగ్రామ్’ బాలిక హత్య.. కీలక విషయాలు
HYD: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువకుడు <<14646252>>బాలికను<<>> హత్య చేసిన ఘటనలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. విఘ్నేష్ (చింటూ) కోసం బాలిక OCT 20న ఇంటి నుంచి వెళ్లిపోయింది. చింటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా దగ్గరయ్యాడు. బాలిక పెళ్లికి ఒత్తిడి తేగా దండలు మార్చుకున్నారు. అందరి సమక్షంలో చేసుకుందామని పదేపదే అడగడం, అదే సమయంలో ఇన్స్టాగ్రామ్లో మరొకరితో చాట్ చేస్తోందని అనుమానించి చింటూ ఆమెను చంపేశాడు.
News November 19, 2024
ఇవాళ పోలీసు విచారణకు ఆర్జీవీ!
AP: సోషల్ మీడియా పోస్టుల విచారణకు సంబంధించి డైరెక్టర్ రామ్గోపాల్ వర్మను ఇవాళ ఒంగోలు పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది. ఆ వెంటనే ఆయనను అరెస్ట్ చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ను కించపరుస్తూ RGV సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొందరు మద్దిపాడు PSలో ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
News November 19, 2024
రోజుకు 14గంటలు పనిచేయాల్సిందేనన్న CEO.. నెట్టింట విమర్శలు!
ఉద్యోగులు వారానికి 70గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు చనిపోతున్నారని నెట్టింట విమర్శలూ వచ్చాయి. తాజాగా భారత సంతతి వ్యక్తి, శాన్ఫ్రాన్సిస్కోలోని ‘గ్రెప్లైట్’ CEO దక్ష్ గుప్తా కూడా రోజుకు కనీసం 14గంటలు పనిచేయాలని చెబుతున్నారు. ఒక్కోసారి ఆదివారాలు వర్క్ చేయాలని చెప్పారు. దీంతో నారాయణమూర్తికి శిష్యుడు దొరికాడరనే చర్చ మొదలైంది.