News December 25, 2024
శాంటా సెర్చింగ్.. గిఫ్ట్లపైనా జీఎస్టీ ఉందా?

ఇటీవల పాత కార్లు, పాప్కార్న్పైనా జీఎస్టీ పెంచడంతో కేంద్రంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఇవాళ క్రిస్మస్ కావడంతో ‘గిఫ్ట్లపైనా జీఎస్టీ ఉందా?’ అని శాంటా తాతయ్య ఆన్లైన్లో వెతుకుతున్న ఫొటో వైరల్ అవుతోంది. దీన్ని షేర్ చేస్తున్న నెటిజన్లు ‘ఎందుకుండదు అన్నింటిపైనా జీఎస్టీ ఉంటుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారు?
Similar News
News October 17, 2025
కాంగ్రెస్, MIM అన్ని హద్దులూ దాటాయి: బండి

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు MIM మద్దతివ్వడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘కాంగ్రెస్, MIM సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి. BJP, MIM ఒక్కటేనని ప్రచారం చేసే రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ ఒవైసీ ఒడిలో కూర్చుంది. BJP ఒంటరిగా పోటీ చేస్తోంది. MIMకు పోటీ చేసే ధైర్యమే చేయలేదు. మీరేం చేసినా మేమే గెలుస్తాం. ప్రజలు ఓట్లతో జవాబిస్తారు’ అని ట్వీట్ చేశారు.
News October 17, 2025
3 రోజులు సెలవులు!

TG: రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఉండటంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలు శనివారం సెలవు ప్రకటించాయి. ఎల్లుండి ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు రానున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకూ వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. మరి లాంగ్ వీకెండ్ నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవులు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News October 17, 2025
రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ

AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రుల బృందం రేపు 12 PMకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ ఉద్యోగులకు డీఏ సహా వివిధ ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం మంత్రులను ఆదేశించారు.