News January 3, 2025
బంగ్లా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న శాంటో

బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ శాంటో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నారు. బంగ్లా క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన తమకు సమాచారాన్ని అందించారని, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. టెస్టులు-వన్డేల్లో శాంటోనే కెప్టెన్గా కొనసాగుతారని వెల్లడించింది. దగ్గర్లో టీ20 సిరీస్ లేని నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేసింది.
Similar News
News December 10, 2025
శ్రీ సత్యసాయి, అనంతలో ‘స్క్రబ్ టైఫస్’ కలకలం

కలకలం సృష్టిస్తున్న స్క్రబ్ టైఫస్ అనంత జిల్లాకూ పాకింది. రాయదుర్గం సమీపంలోని తాళ్లకెరకు చెందిన బాలిక జ్వరంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి రాగా రక్తపరీక్షలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి(D) ముదిగుబ్బ మండలానికి చెందిన గర్భిణి ప్రసవం నిమిత్తం చేరారు. జ్వరం ఉండటంతో ఆమెకూ పరీక్షలు చేశారు. ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 2 రోజుల క్రితం హిందూపురంలో ఓ మహిళకు స్క్రబ్ టైఫస్ సోకింది.
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<
News December 10, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.


