News December 12, 2024
57 ఏళ్ల తర్వాత HYDలో సంతోష్ ఫుట్‌బాల్ టోర్నీ

మరో క్రీడా సంబరానికి హైదరాబాద్ సిద్ధమైంది. 1966-67లో చివరిగా భాగ్యనగరంలో సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీ జరగ్గా, ఈ ఏడాది మళ్లీ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 31 వరకు డెక్కన్ అరేనా స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 37 జట్లు పాల్గొననున్నాయి. CM రేవంత్ ఢిల్లీలో తాజాగా ఈ టోర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. చరిత్రాత్మక టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.
Similar News
News February 11, 2026
ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.
News February 11, 2026
శివుడు లేని చోటు గలదా?

ఓ సముద్రంలో పుట్టిన అల, తను సముద్రం కంటే వేరు అనుకుంటుంది. అందుకే ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసి ఒడ్డుకు వస్తుంది. కానీ అలకు మూలం, ఆధారం, అంతం ఆ సముద్రమే! అలాగే ఈ జగత్తులో మనం చూసే ప్రతి రూపం ఆ మహాశివుడనే సముద్రంలో పుట్టిన చిన్న అల మాత్రమే. రూపం చూస్తే అది మనిషిలాగో లేదా రాయిలాగో కనిపిస్తుంది. కానీ దాని సారాన్ని చూస్తేనే అది శివతత్వం అని అర్థమవుతుంది. సర్వం శివమే అని నమ్మితే ఆయన అనుగ్రహం కలుగుతుంది.
News February 11, 2026
న్యూజిలాండ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం

T20 WCలో వరుస విజయాలతో జోరు మీదున్న న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. ఆదివారం వార్మప్ సమయంలో అతను గాయపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్(NZC) తెలిపింది. బ్రేస్‌వెల్ స్థానంలో కోల్ మెక్‌కాంచీ రిజర్వ్ బౌలర్ బెన్ సియర్స్‌తో కలిసి జట్టులో చేరనున్నట్లు పేర్కొంది. న్యూజిలాండ్ తన మూడో మ్యాచ్ ఈ నెల 14న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.


