News April 14, 2024

పాక్‌లో సరబ్‌జిత్ హంతకుడి కాల్చివేత

image

పాకిస్థాన్‌లో మాఫియా డాన్ అమీర్ సర్ఫరాజ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. పాక్ జైల్లో భారతీయుడు సరబ్‌జిత్‌ను హత్య చేసింది ఇతడే కావడం గమనార్హం. లాహోర్‌లో ఉన్న అమీర్‌ను సమీపించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అమీర్ అక్కడికక్కడే హతమైనట్లు తెలుస్తోంది. గడచిన కొంతకాలంగా పాక్‌లోని గ్యాంగ్‌స్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అంతం చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News April 4, 2026

ఔషధాలపై ట్రంప్ టారిఫ్స్.. ఇండియాపై ప్రభావమెంత?

image

అమెరికా రీసెంట్‌గా కొన్ని పేటెంటెడ్ డ్రగ్స్‌పై 100% టారిఫ్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇండియాపై పెద్దగా ప్రభావం ఉండదని GTRI చెబుతోంది. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లేది తక్కువ ధర ఉండే ‘జనరిక్’ మెడిసిన్స్ మాత్రమేనని వివరించింది. మన ఎగుమతుల్లో పేటెంటెడ్ డ్రగ్స్ వాటా తక్కువ కాబట్టి మన ఫార్మా కంపెనీలు సేఫ్ జోన్‌లోనే ఉన్నాయని స్పష్టం చేసింది.

News April 4, 2026

ఇవాళ, రేపు జాగ్రత్త!

image

AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఏలూరు, పల్నాడు జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా నిన్న 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మన్యం(D)లోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదైంది.

News April 4, 2026

ALERT: ఇవాళ వర్షాలు

image

ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.