News April 15, 2025

సరస్వతీ పుష్కరాలు.. ప్రత్యేక యాప్ ఆవిష్కరణ

image

TG: వచ్చే నెలలో సరస్వతీ పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో మంత్రులు శ్రీధర్ బాబు, సురేఖ ప్రత్యేక యాప్‌, వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. కాళేశ్వరంలో మే 15-26 వరకు జరిగే పుష్కరాలకు సంబంధించిన సమగ్ర వివరాలను ఇందులో పొందుపరిచారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రోజూ లక్ష మంది భక్తులు వస్తారని అంచనా. ఈ త్రివేణి సంగమంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని విశ్వసిస్తారు.

Similar News

News November 24, 2025

మీకోసం కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ కోసం కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.

News November 24, 2025

రైతన్న మీకోసం పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 24 నుంచి 30 వరకు నిర్వహించనున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అమలాపురంలో కలెక్టరేట్‌లో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోని అధికారులు సమర్థవంతంగా నిర్వహించి, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.