News July 13, 2024
15 నుంచి సర్దార్-2 షూటింగ్ షురూ

పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో కార్తీ హీరోగా సర్దార్-2 షూటింగ్ ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇవాళ చెన్నైలో పూజా కార్యక్రమాలు జరిగాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సర్దార్ సినిమా 2022లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ‘కాంబోడియా స్పై మిషన్’లో హీరో ఏం చేశాడనే కథాంశంతో సీక్వెల్ రూపొందనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.
Similar News
News March 31, 2026
144ఏళ్లుగా నిర్మిస్తూనే ఉన్నారు!

స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో సగ్రాడా ఫెమిలియా చర్చి నిర్మాణం 144 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. 1882లో ఆంటోని గౌదీ అనే ఆర్కిటెక్ట్ ప్రారంభించిన దీని నిర్మాణానికి యుద్ధాలు, సంక్షోభాలు వంటి ఎన్నో అవాంతరాలు వచ్చాయి. మొత్తానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో దీని ఎక్స్‌టీరియర్ నిర్మాణం పూర్తయింది. 2034కి దీని ఇంటీరియర్స్ పూర్తవుతాయని అంచనా. 172.5 మీటర్ల టవర్స్‌తో ఈ చర్చ్ ప్రపంచంలోనే అతి ఎత్తయిన చర్చిగా నిలవనుంది.
News March 31, 2026
ఈసారీ సత్తా చాటుతారా?

ఈ ఐపీఎల్ సీజన్‌లో GT కెప్టెన్ శుభ్‌మన్ గిల్, PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ల ప్రదర్శనపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 175 స్ట్రైక్ రేటుతో అయ్యర్ లాస్ట్ సీజన్‌లో 604 రన్స్ చేయగా గిల్ 155 స్ట్రైక్ రేటుతో 650 పరుగులు చేశారు. ఇటీవల T20WCలో చోటు దక్కకపోవడంతో ఈ సీజన్‌లో రాణించి జట్టులో చోటు దక్కించుకోవాలని గిల్, అయ్యర్‌లు ఆశిస్తున్నారు.
News March 31, 2026
పోలవరంపై ‘వార్’ ఎఫెక్ట్

AP: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పోలవరం ప్రాజెక్టుపైనా పడింది. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ కోసం పక్కనే ఉన్న కొండల నుంచి రాయిని తొలిచేందుకు ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ గల్ఫ్ నుంచి రావాల్సి ఉంది. ఇటీవల బ్లాస్టులకు వాడటంతో అమ్మోనియం నైట్రేట్ కొరత ఏర్పడింది. దీంతో 30శాతం బ్లాస్టింగ్ పనులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఇక డయాఫ్రమ్ వాల్ పనులు అనుకున్న గడువులోగానే పూర్తవుతున్నాయని వెల్లడించారు.


