News April 17, 2025
సరిలేరు నీకెవ్వరు.. చిన్నారుల ఆపరేషన్‌కు మహేశ్ సాయం

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు హీరో మహేశ్‌బాబు ఉచితంగా ఆపరేషన్స్ చేయిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు పిల్లలకు శస్త్రచికిత్స చేయించినట్లు ‘MB ఫౌండేషన్’ ట్వీట్ చేసింది. వరలక్ష్మి (2 నెలలు), పండూరి ఇముగ్ధ శ్రీ (5 నెలలు), పూజ్యశ్రీ ఫనీక్ష (8 నెలలు)లకు హార్ట్ ఆపరేషన్లు చేసి కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా, ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 4500+ సర్జరీలు జరగడం విశేషం.
Similar News
News April 19, 2025
సమ్మర్‌లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?

వేసవికాలంలో ఎండల దెబ్బకు శరీరం చెమటతో తడిసిముద్దవుతుంది. దీని నుంచి రిలీఫ్ కావాలంటే కొన్ని రకాల దుస్తులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు కాటన్‌తో కూడిన లూజ్ బట్టలు ధరించాలి. వీటి వల్ల చెమట ఈజీగా బయటకు వస్తుంది. ఇంట్లో ఉంటే షార్ట్స్, స్లీవ్ లెస్ టీషర్ట్స్ ధరించవచ్చు. లేత రంగుల దుస్తులు ధరించాలి. బ్లాక్, బ్లూ, రెడ్ వంటి రంగుల దుస్తులు వేసుకుంటే వేడిని గ్రహించి అలసిపోతారు.
News April 19, 2025
రేపే బీసీ గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

TG: బీసీ గురుకుల స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు రేపు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 109 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. మొత్తం 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు 26,884 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు.
News April 19, 2025
ఈ నెల 23న ‘పది’ ఫలితాలు?

AP: ఈ నెల 23న పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేపర్ల వ్యాల్యుయేషన్ కూడా పూర్తయ్యింది. విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కు 6,19,275 మంది హాజరయ్యారు. వీరిలో 5,64,064 మంది ఇంగ్లిష్ మీడియం, 51,069 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాశారు. Way2Newsలోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.