News September 26, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘సరిపోదా శనివారం’

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు డిజిటల్ వేదికపై అలరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ఎస్.జే.సూర్య విలన్గా నటించగా ప్రియాంక మోహన్ హీరోయిన్గా సందడి చేశారు.
Similar News
News November 25, 2025
సూర్యాపేట: సర్పంచ్ ఎన్నికలు.. మన గ్రామానికి ఎప్పుడంటే..

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూరు మండలాల్లో, రెండో విడత మోతె, చివ్వెంల, పెన్ పహాడ్. చిలుకూరు, కోదాడ, మునగాల, అనంతగిరి, నడిగూడెం మండలాల్లో జరగనున్నాయి. HNR నియోజకవర్గంలోని గ్రామాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.

శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

రష్యాతో పీస్ డీల్కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.