News September 1, 2024
రూ.50కోట్ల క్లబ్‌లోకి ‘సరిపోదా శనివారం’!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ 3 రోజుల్లోనే ₹50కోట్ల వసూళ్లను దాటేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ మూవీ తొలి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹36.03కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. మూడో రోజు వసూళ్లతో ₹50కోట్ల మార్క్ దాటినట్లు తెలుస్తోంది. దీంతో నాని హ్యాట్రిక్ సాధించారు. ఆయన నటించిన గత రెండు సినిమాలు (దసరా, హాయ్ నాన్న) కూడా ₹50కోట్లకు పైగానే వసూళ్లు సాధించాయి.
Similar News
News March 6, 2025
మ్యాచులో నిద్ర పోయాడు.. ఔట్ అయ్యాడు

పాకిస్థాన్ క్రికెటర్ సౌద్ షకీల్ అరుదైన రీతిలో ఔటయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిద్ర పోయి క్రీజులోకి రాకపోవడంతో ఆయన టైమ్డ్ అవుట్ అయ్యారు. పాకిస్థాన్ టెలివిజన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ జట్టు ఆటగాడు షకీల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. 3 నిమిషాలలోపు అతడు బ్యాటింగ్‌కు రాకపోవడంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. ఆ ఓవర్లో హ్యాట్రిక్ సహా మొత్తం నలుగురు ఔటయ్యారు.
News March 6, 2025
భూములు అమ్మితేగానీ ప్రభుత్వం నడపలేరా?: KTR

TG: భూములు అమ్మితే తప్ప ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి సీఎం రేవంత్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని KTR విమర్శించారు. గచ్చిబౌలి పరిధిలో 400 <<15655774>>ఎకరాలను <<>>అమ్మి రూ.30వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోందన్న వార్తలపై మండిపడ్డారు. ఈ భూములు అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ మాట మార్చారని దుయ్యబట్టారు. హైడ్రా, మూసీ పరిధిలో కూల్చివేతలతో రాష్ట్ర ఆదాయం తగ్గిందని ఆరోపించారు.
News March 6, 2025
SLBC టన్నెల్లోకి రోబోలు?

TG: SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కోసం రోబోలను వాడే ప్రయత్నం జరుగుతోంది. HYDకు చెందిన NV రోబోటిక్స్ ప్రతినిధులు టన్నెల్లోకి వెళ్లి పరిస్థితులు అధ్యయనం చేశారు. రోబోలను పంపే సాధ్యాసాధ్యాలపై వీరు రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. దానినిబట్టి రోబోలను వాడే అంశంపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కన్వేయర్ బెల్ట్ మరోసారి టెక్నికల్ ప్రాబ్లమ్‌తో నిలిచిపోవడంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి.