News September 2, 2024
రికార్డు కలెక్షన్లు రాబడుతోన్న ‘సరిపోదా శనివారం’

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. గత నెల 29న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద శివ తాండవం చేస్తోందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. నాలుగు రోజుల్లోనే రూ.68.52 కోట్లు కలెక్ట్ చేసిందని వెల్లడించారు. వీక్ డేస్ కావడంతో కలెక్షన్స్ కాస్త తగ్గనుండగా తిరిగి వీకెండ్లో మళ్లీ పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి.
Similar News
News November 20, 2025
IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <
News November 20, 2025
స్కాలర్షిప్ బకాయిల విడుదలకు ఆదేశం

TG: ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2,813 కాలేజీలకు సంబంధించి రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటిని వెంటనే విడుదల చేయాలని భట్టి ఆదేశించారు.
News November 20, 2025
అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

డాలర్‌కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్‌కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.


