News September 21, 2024
సింగరేణి కార్మికులకు సర్కార్ చేదు కబురు: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ సర్కార్ సింగరేణి కార్మికుల ఆశలను అడియాశలు చేసిందని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. దసరాకు తీపి కబురుకు బదులు చేదు కబురు చెప్పిందని విమర్శించారు. ‘మా హయాంలో రూ.2,222 కోట్ల లాభాలు వస్తే రూ.710 కోట్ల బోనస్ ఇచ్చాం. కానీ ఇప్పుడు రూ.4,701 కోట్ల లాభం వచ్చినా రూ.796 కోట్లే ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా 33 శాతం లాభాలు పంచితే మిగతా రూ.754 కోట్లు ఏమయ్యాయి?’ అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News September 15, 2025
భారత్ విక్టరీ.. ముఖం చాటేసిన పాక్ కెప్టెన్

భారత్ చేతిలో ఘోర ఓటమో, షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదనో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బ్రాడ్కాస్టర్తో మాట్లాడకుండా ముఖం చాటేశారు. పీసీబీ ఆదేశాలతోనే ఆయన ఈ సెర్మనీకి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం మ్యాచ్ ముగిసిన వెంటనే ఓడిన జట్టు కెప్టెన్ బ్రాడ్కాస్టర్తో మాట్లాడతారు. మరోవైపు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా భారత్ క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించిందని పాక్ ACAకు ఫిర్యాదు చేసింది.
News September 15, 2025
రాబోయే రెండు గంటల్లో వర్షం

ఏపీలోని ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. TGలోని సంగారెడ్డి, వికారాబాద్, HYD, RR, కామారెడ్డి, MDK, SDPT, SRPT, NLG, KMM, కొత్తగూడెం, భువనగిరి, HNK, SRCL, జగిత్యాల, KNR, ADLB, NZMBలో సాయంత్రం తర్వాత పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
News September 15, 2025
ఉద్దేశపూర్వకంగానే బకాయిల ఎగవేత: కవిత

TG: కాంగ్రెస్ కమీషన్ల సర్కారు అమ్మాయిల చదువులను కాలరాస్తోందని కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. కావాలనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎగవేస్తోందని దుయ్యబట్టారు. 20% కమీషన్లు ఇస్తేనే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారని కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తోందని విమర్శించారు.