News November 22, 2024

సంక్రాంతి తర్వాత సర్పంచ్ ఎన్నికలు?

image

TG: 2025 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ రెండో వారం నాటికి రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, డిసెంబర్ చివర్లో లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత మొత్తం మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 22, 2024

టిష్యూ ఖరీదు రూ.8.4 కోట్లు.. ఎందుకంటే?

image

అర్జెంటీనా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో అభిమానులున్నారు. అందులో కొందరు ఆయన ధరించిన జెర్సీ, షూ తదితర వస్తువులను వేలంలో రూ.కోట్లు చెల్లించి దక్కించుకుంటారు. అలాంటి ఓ వేలంలో మెస్సీ తన కన్నీళ్లు తుడుచుకోడానికి వాడిన టిష్యూ కూడా ఉంది. వరల్డ్ కప్ -2022 విజయం తర్వాత ఆయన భావోద్వేగం చెందుతూ వినియోగించిన టిష్యూను $1 మిలియన్(రూ.8.45 కోట్లు)కు ఓ వ్యక్తి కొనుగోలు చేశారు.

News November 22, 2024

అదానీతో దేశానికి నష్టమైతే తెలంగాణకు కాదా?: KTR

image

TG: గౌతం అదానీ వల్ల రెండోసారి భారత దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా దెబ్బతిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఇప్పటికైనా అదానీతో CM రేవంత్ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని చెబుతారా? చెప్పరా? స్పష్టత ఇవ్వాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. అదానీతో దేశానికి నష్టం జరుగుతున్నప్పుడు తెలంగాణకు నష్టం కాదా? అని ప్రశ్నించారు. TG దేశంలో భాగమే కదా అన్నారు.

News November 22, 2024

సంక్రాంతి లోపు పనులు పూర్తి చేస్తాం: పవన్ కళ్యాణ్

image

AP: NREGS ద్వారా రూ.4,500 కోట్లతో 30వేల పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతి లోపు ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఉపాధి పథకం నిధుల మళ్లింపు, జాబ్‌ కార్డుల్లో అవకతవకలు జరిగాయని MLAలు సభ దృష్టికి తీసుకురాగా, వాటిపై విచారణ చేస్తామని పవన్ ప్రకటించారు. ఉపాధి హామీ కింద కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క తొలగింపు, శ్మశానవాటికల ప్రహరీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.