News May 25, 2024

అన్నామలై వ్యాఖ్యలకు శశికళ కౌంటర్

image

తమిళనాడు మాజీ సీఎం జయలలిత హిందుత్వ నాయకురాలని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరణంతో అన్నాడీఎంకే హిందుత్వానికి దూరమైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఖాళీని పూరించేందుకు బీజేపీకి అవకాశం దక్కిందన్నారు. కాగా అన్నామలై వ్యాఖ్యలను జయలలిత సన్నిహితురాలు శశికళ ఖండించారు. జయ ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదన్నారు. అందరినీ సమానంగా చూసిన ఏకైక నాయకురాలని తెలిపారు.

Similar News

News December 8, 2025

చలితో ఉమ్మడి వరంగల్ గజ గజ!

image

వరంగల్‌ నగరంలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయంలో 12 డిగ్రీలు ఉంటోంది. వచ్చే మూడు రోజుల్లో కనీస ఉష్ణోగ్రతలు 10-11 డిగ్రీల వరకు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ములుగులో 12, భూపాలపల్లిలో 12.1, జనగామలో 12.4, మహబూబాబాద్‌లో 13, వరంగల్ జిల్లాలో 12 డిగ్రీలకు చేరింది. గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరగడంతో జనం వణికిపోతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.

News December 8, 2025

మైసూరు పప్పు మాంసాహారమా?

image

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.

News December 8, 2025

ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

image

ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.