News July 9, 2025
విశాఖలో సత్వా వాంటేజ్ మిక్స్డ్ క్యాంపస్

AP: రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. బెంగళూరులో మంత్రి లోకేశ్ ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తర్వాత ఆసంస్థ 30ఎకరాల్లో రూ.1500 కోట్లతో వాంటేజ్ మిక్స్డ్ డెవలప్మెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ తెలిపారు. ANSR సంస్థ కూడా విశాఖలో GCC ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వంతో MOU చేసుకుంది.
Similar News
News August 31, 2025
రేపు రాజంపేటలో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రాజంపేట మండలం, కె.బోయినపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల 1న సీఎం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నేరుగా పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. రేపటి కార్యక్రమం అనంతరం సాయంత్రం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.
News August 31, 2025
భారత్‌పై మరో కుట్రకు తెరలేపిన ట్రంప్?

50% టారిఫ్స్ అమలు చేస్తూ భారత ఎకానమీని దెబ్బకొట్టాలని చూస్తున్న ట్రంప్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. తమలాగే ఇండియాపై టారిఫ్స్ విధించాలని యూరోపియన్ దేశాలకు US సూచించినట్లు సమాచారం. IND నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్లను కూడా పూర్తిగా నిలిపేయాలని చెప్పినట్లు తెలిసింది. ట్రేడ్ డీల్‌కు భారత్ ఒప్పుకోకపోవడం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోవడంతో ట్రంప్ అసహనానికి గురై ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం.
News August 31, 2025
నేడు కీలక చర్చ.. ప్రభుత్వం ఏం చేయనుంది?

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రిపోర్ట్‌ను మంత్రి ఉత్తమ్ సభ్యులకు వివరించిన అనంతరం సుదీర్ఘంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. సిట్ లేదా సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అటు పూర్తి నివేదికకు బదులు 63 పేజీల షార్ట్ రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెడతారని వార్తలొస్తున్నాయి.