News January 18, 2025

సెమీ ఫైనల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి ఓటమి

image

ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో మెన్స్ డబుల్స్ జంట సాత్విక్-చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్స్‌లో మలేషియా జోడీ గోహ్ స్జెఫీ-నూర్ ఇజ్జుద్దీన్‌ 21-18, 21-14 తేడాతో గెలిచింది. కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. ఇప్పటికే పీవీ సింధు కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా 21-9, 19-21, 21-17 తేడాతో గెలిచారు.

Similar News

News October 23, 2025

జూబ్లీహిల్స్‌లో రౌడీషీటర్‌ను ఓడించండి: KCR

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని BRS చీఫ్ KCR పేర్కొన్నారు. ‘భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు చిత్తుగా ఓడించి HYDలో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వసిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. మాగంటి సునీత గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నేతలకు KCR దిశా నిర్దేశం చేశారు.

News October 23, 2025

TET తీర్పుపై సమీక్షకు సుప్రీంలో పిటిషన్: APTF

image

AP: TETపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ సమీక్ష కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు ఏపీటీఎఫ్ తెలిపింది. ‘2017లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం RTE-2010కి పూర్వం ఉన్న టీచర్లు కూడా TET పాస్ కావాలని సుప్రీం తీర్పిచ్చింది. అయితే అప్పటి టీచర్లకు టెట్‌ను వర్తింపచేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతోంది. 2010కి ముందున్న టీచర్లను దీని నుంచి మినహాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి’ అని విన్నవించింది.

News October 23, 2025

మహిళా శక్తి.. ప్రశంసించాల్సిందే!

image

నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం సజావుగా నడుస్తోంది. ఈ క్రమంలో ఇంటి పని, ఆఫీస్ ఒత్తిడి, కుటుంబాన్ని చక్కదిద్దే బహుముఖ పాత్రను పోషిస్తున్న మహిళల కృషి అసాధారణమైనది. ఆఫీసు పనితో పాటు ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనా పాలన చూసుకోవడం అంత తేలిక కాదు. ఈ సవాళ్లు అలసట కలిగించినా, తన ప్రేమ, బలం, దృఢ సంకల్పంతో ఆమె అన్నిటినీ సమన్వయం చేస్తోంది. నిజంగా, మహిళే ఆ కుటుంబానికి గుండెకాయ!